దోశలు తినేప్పుడు ఆరోగ్యకరమైన పచ్చడి వాడడం.. మనం ఉదయాన్నే తినే ..ఆహారాన్ని మరింత న్యూట్రిషియస్‌గా మారుస్తుంది.
పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వంటి పదార్థాలతో చేసిన పచ్చడి పౌష్టికతను అందిస్తుంది.
పెసరపప్పు పచ్చడి చేయడానికి, పెసరపప్పును కొద్దిగా వేపి..2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్సీలో రుబ్బి పచ్చడి చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ పచ్చడిని తిరగమాత పెట్టుకుంటే చాలు. పెసరపప్పు పచ్చడి రెడీ. ఈ పచ్చడిలో అధిక ప్రోటీన్, ఫైబర్, ఖనిజాల పుష్కలంగా లభిస్తాయి.
పెసరపప్పు పచ్చడి మీ బరువు తగ్గడానికి.. సహాయం చేస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.
దోశలో ఈ పచ్చడి కలిపి తినడం వల్ల.. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.