చలికాలం మొదలైంది. ఈ సీజన్ లో కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఆకుపచ్చ కూరగాయలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది.
శీతాకాలంలో బ్రోకలీ తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రోకలీని చాలా మంది ఇష్టంగా తింటారు. క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందుల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పోషకాలు పుష్కలంగా ఉన్నందున బ్రోకలీని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరం ఫిట్ గా ఉంటుంది.
బ్రోకలీలో తగిన మొత్తంలో విటమిన్ బి, విటమిన్ సి ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చలికాలంలో దీన్ని తింటే జుట్టు రాలడం తగ్గుతుంది.
బ్రోకలీలో ఉండే పోషకాలు మెదడుకు మేలు చేస్తాయి. బ్రోకలీ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
చల్లని వాతావరణంలో చర్మం పొడి, గరుకుగా మారుతుంది. శీతాకాలంలో బ్రోకలీ తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్లూకోరాఫేన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బ్రోకలీలో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.