హిందూమతంలో చెట్లు, పువ్వులు, మొక్కలను కూడా దేవుళ్లుగా పూజిస్తారు. శివుడి పూజలో అనేక రకాల పువ్వులను సమర్పిస్తారు. ఇందులో జిల్లేడు పువ్వు ఒకటి
జిల్లేడు పువ్వులు కేవలం పూజించడానికే కాదు..ఇందులో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అనేక వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. జిల్లేడు పువ్వులో దాగి ఉన్న రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జిల్లేడు మొక్కను అకోవా, అక్వాన్, మదార్ అనే పేర్లతో పిలుస్తారు. చాలా మంది ఈ మొక్కను విషపూరిత మొక్కగా భావిస్తారు. అయితే ఈ మొక్క అనేక వ్యాధుల్లో చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
నేటికి చాలా మంది ఈ పువ్వులను అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తున్నారు.
దగ్గుతూ బాధపడేవారికి జిల్లేడు మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జిల్లేడు పువ్వును పొడిగా చేసి ఉపయోగిస్తారు.
దగ్గుతోపాటు జలుబు వేధిస్తుంటే జిల్లేడు పువ్వుల పొడిని తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
శ్వాసకోశ సమస్యలు ఉంటే జిల్లేడు పొగను పీల్చుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, జలుబుతోపాటు జ్వరం వేధిస్తుంటే జిల్లేడు రసాన్ని నుదిటిపై పూసుకుంటే ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడుతుంది.
దురద, రింగ్ వార్మ్ సమస్యలు వేధిస్తుంటే చర్మంపై జిల్లేడు పువ్వుల పాలను పూయాలి. దురద, రింగ్ వార్మ్ త్వరగా తగ్గుతుంది.