మనలో చాలా మంది బలహీనంగా ఉంటారు. తరచుగా నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు.
ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. ఈ కారణంగా నీరసం, అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.
అయితే మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఓ చక్కటి రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని తింటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.
బాదంపప్పు, నానబెట్టిన సబ్జాగింజలు, ఓట్స్, ఆపిల్, అరటిపండు, వేడి చేసిన పాలు, నీళ్లు, బెల్లం
ముందుగా ఒక గిన్నెలోకి పాలు, నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత అందులో బాదం, ఓట్స్ వేసి కలపాలి. ఉడిచిన తర్వాత సబ్జా గింజలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత అందులో బెల్లం, అరటి ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచికరమైన ఎనర్జిటిక్ ఫుడ్ రెడీ అవుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు ఇందులో బెల్లం వేసుకోకపోవడం మంచిది. ఇతర పండ్ల ముక్కలను, డ్రైఫ్రూట్స్ ను వేసుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు, బీపీతో బాధపడేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా ఎవరైనా దీన్ని తినవచ్చు.
నీరసం, బలహీనత, నిస్సత్తువ, రోజంతా ఉత్సాహంగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఎనర్జిటిక్ ఫును తయారు చేసుకుని తినవచ్చు.