ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని ఉంటుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఈ పని చేస్తే చాలు..మీ ముఖం ఎప్పటికీ నిగనిగలాడుతుంటుంది
రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో ముఖం పాలిపోతుంటుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా వయస్సు కంటే ముందే ముడతలు వచ్చేస్తుంటాయి. ముఖంపై పింపుల్స్ వేధిస్తుంటాయి.
అందుకే రాత్రి పడుకునేముందు కొన్ని పద్ధతులు పాటిస్తే ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మసాజ్ చేసి పడుకోవాలి. రోజంతా అలసట కారణంగా ముఖం పాలిపోతుంటుంది. మసాజ్ ద్వారా మొత్తం అలసట పోతుంది.
ముఖంపై ఉండే చర్మం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే మసాజ్ అనేది చాలా అవసరం.
రోజూ మసాజ్ చేయడం వల్ల ముఖ చర్మంపై ఉండే రక్త నాళికలు ఉత్తేజితమౌతాయి. డ్రైనెస్ సమస్య పోతుంది.
రాత్రి వేళ రోజూ ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉండే చిన్న చిన్న పోర్స్ క్లీన్ అవుతాయి. పింపుల్స్ సమస్య కూడా తొలగిపోతుంది.
ముఖ చర్మం మూమెంట్‌తో రక్త సరఫరా మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే కణాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. దాంతో ముఖంపై నిగారింపు వస్తుంది.