మహిళలు తాము అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా కనిపించేందుకు రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
మార్కెట్లో దొరికే ప్రొడక్టుల కంటే ఇంట్లోనే లభించే వస్తువులతో ముఖం మెరిసిపోతుంది. కలబందలో ఈ వస్తువు మిక్స్ చేసి ముఖానికి అప్లయ్ చేస్తే ముఖం తెల్లగా మారుతుంది.
అలోవెరా మెరిసే, ఆరోగ్యకరమైన చర్మానికి ఉపయోగపడుతుంది. కలబందతోపాటు పెరుగు, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ అవసరం.
ఒక గిన్నెలో రోజ్ వాటర్ తో కలబంద జెల్, పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖం, మెడపై బాగా రాయాలి. 20 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కలబంద, తేనె ప్యాక్ కూడా ముఖాన్ని మెరిచేలా చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు కలబంద, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి.
ఈ అలోవెరా ఫేస్ ప్యాక్ అప్లయ్ చేస్తే ముఖఛాయ మెరుగవుతుంది. డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.