ఈ ఉప్మా వెన్నలా మీ మొండి కొవ్వును మొత్తం కరిగిస్తుంది!

Dharmaraju Dhurishetty
Sep 20,2024
';

ముఖ్యంగా కొర్రల్లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది ఇది శరీర బరువును నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తుంది.

';

ముఖ్యంగా తరచుగా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్లో భాగంగా కొర్రలను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

కొర్రలు ఉండే మూలకాలు శరీరంలోని మొండి కొవ్వును సులభంగా కరిగిస్తాయి. ఇవే కాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి.

';

అయితే చాలామంది కొర్రల ఉప్మాను ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. నిజానికి వీటితో తయారు చేసిన ఉప్మాను రోజు తినడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.

';

మీరు కూడా కొర్రలతో తయారుచేసిన ఉప్మాను తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా తయారు చేసుకోండి..

';

కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, చిటికెడు పసుపు, ఉప్పు - రుచికి సరిపోయేంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

కావలసిన పదార్థాలు: కారం - రుచికి సరిపడ, కరివేపాకు - కొద్దిగా, చింతపండు - కొద్దిగా

';

కావలసిన పదార్థాలు: ముక్కలు చేసిన కూరగాయలు, (ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్) , కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్ (రుచికి సరిపడా )

';

తయారీ విధానం..కొర్రలు నానబెట్టడం: ముందుగా ఈ ఉప్మాను తయారు చేయడానికి కొర్రలను కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.

';

నీరు వడకట్టడం: నానబెట్టిన కొర్రలను బాగా కడిగి నీరు వడకట్టాలి.

';

వేయించడం: ఒక పాత్రలో నూనె వేసి వేడి చేసి, కొర్రలను వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి.

';

కూరగాయలు వేయించడం: ఆ తర్వాత స్టవ్ పై మరో బాధలు పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను వేసి బాగా వేయించాలి.

';

కలిపి వేయించడం: వేగించిన కొర్రలలో వేగించిన కూరగాయలు, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, చింతపండు, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి మరోసారి వేయించుకోవలసి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ బౌల్ పెట్టుకొని అందులో కొర్రలకు సరిపడా నీటిని వేసుకొని.. ఈ వేయించుకున్న కొర్రలను వేసుకొని ఉప్మా తయారయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి.

';

బాగా ఉడికించుకున్న ఉపమానం పల్లి చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి వేరే లెవెల్...

';

VIEW ALL

Read Next Story