ప్రతి రోజు గుమ్మడి గింజల లడ్డూను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Dharmaraju Dhurishetty
Jul 31,2024
';

హృదయ ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

ప్రోస్టేట్ ఆరోగ్యం: పురుషులలో ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడానికి కూడా గుమ్మడి గింజలు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

నిద్ర నాణ్యతను పెంచుతాయి: గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి, మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

';

బరువు తగ్గడం: గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

';

చర్మ ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.

';

కండరాల ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

మెదడు ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

మీరు కూడా ఇంట్లోనే గుమ్మడి గింజల లడ్డూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

గుమ్మడి గింజల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు

';

కావాల్సిన పదార్థాలు: నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఏలక్కాయలు - 2 నుంచి 3, జీడిపప్పు - 10 నుంచి 12

';

తయారీ విధానం: ముందుగా ఈ లడ్డును తయారు చేసుకోవడానికి గుమ్మడి గింజలను శుభ్రంగా కడిగి, ఎండబెట్టండి.

';

ఆ తర్వాత బెల్లంను చిన్న ముక్కలుగా చేసుకొనుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి.. నెయ్యి వేడెక్కిన తర్వాత, గుమ్మడి గింజలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

గుమ్మడి గింజలు వేయించిన తర్వాత, బెల్లం ముక్కలు వేసి బెల్లం కరిగే వరకు ఉడికించాలి.

';

బెల్లం కరిగిన తర్వాత, ఏలక్కాయ పొడి వేసి మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

మిశ్రమం చల్లబడిన తర్వాత, చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పుతో అలంకరించి, సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story