వర్షాకాలంతోపాటు.. దగ్గు, జలుబు.. కూడా ఒక ప్యాకేజ్ గా వస్తాయి. మరి దాని నుంచి తప్పించుకోవాలి అంటే.. ఈ కషాయం.. తయారీ విధానం తప్పక తెలుసుకోవాలి..
ఈ కషాయం తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు.. అర స్పూన్ అల్లం పొడి, అర స్పూన్ పసుపు పొడి.
ఇక వాటితో పాటు ఒక స్పూన్ నిమ్మరసం, కొన్ని లవంగాల పొడి, సగం స్పూన్ దాల్చిన చెక్క పొడి.
ముందుగా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత పైన చెప్పిన మిగిలిన పదార్థాలను 5 నిమిషాలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టాలి.
ఈ మిశ్రమంలో రోజుకు రెండుసార్లు..1 చెంచా తేనె..1 చెంచా నిమ్మరసం కలిపి తాగుతూ ఉండాలి.
అంతే వర్షాకాలం వల్ల వచ్చే దగ్గు.. జలుబుకి.. ఇవి తక్షణ ఔషధంలా పనిచేస్తుంది.