గోధుమపిండి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో.. కూడా ఎంతో సహాయపడుతుంది.
గోధుమ పిండి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ఆ ప్యాక్ మొహం పైన ఒక రకమైన మ్యాజిక్‌ను సృష్టిస్తుంది.
ఈ గోధుమపిండి ప్యాక్ చర్మంలోని మలినాలను తొలగించడమే కాకుండా.. అందమైన చర్మాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
ఈ ప్యాక్ చేసుకోవడం కోసం..ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల క్రీమ్ లేదా మలాయ్ తీసుకోండి.
అందులో కొంచెం గోధుమ పిండిని వేసి మెత్తగా పేస్ట్‌లా కలపాలి.
ఈ మిశ్రమాన్ని బాగా ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు ఉంచండి.
అ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే కళకళలాడిపోయే మొహం మీ సొంతం.