చాలామందికి ముఖ్యంగా మహిళలను ఎక్కువగా వేధించే సమస్య డేండ్రఫ్. ఈ సమస్యను దూరం చేసే హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం.

Md. Abdul Rehaman
May 15,2024
';

పెరుగుతో..

పెరుగులోని ప్రో బయోటిక్స్ డేండ్రఫ్ పుట్టించే ఫంగస్‌తో పోరాడేందుకు దోహదపడతాయి. వారంలో ఒకసారి పెరుగును జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసి ఓ గంట తరువాత షాంపూతో స్నానం చేయాలి

';

వేప నూనెతో..

వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ. చుండ్రు దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.

';

మెంతులు..

మెంతి గింజలల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు పేస్ట్ చేసి కేశాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు వేగంగా తగ్గుతుంది

';

ఉసిరితో...

ఉసిరి అనేది విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. చుండ్రును వేగంగా తగ్గించేందుకు దోహదపడుతుంది. ఉసిరి మిశ్రమం లేదా ఆయిల్ వారంలో రెండుసార్లు కేశాలకు రాయాలి.

';

కీరా

కేశాలకు కీరా రసం రాయడం వల్ల డేండ్రఫ్ తొలగిపోతుంది. దాంతో పాటు స్కాల్ప్‌కు చలవ చేస్తుంది.

';

నిమ్మ కొబ్బరి నూనె

నిమ్మ కొబ్బరి నూనెను కేశాలకు రాయడం వల్ల ఇందులోని పోషకాల కారణంగా చుండ్రు వేగంగా తగ్గుతుంది.

';

బేకింగ్ సోడా

పుదీనా జ్యూస్, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమాన్ని కేశాలకు రాసి 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

';

ఆయిల్ మాలిష్

నిర్ణీత పద్ధతిలో క్రమం తప్పకుండా ఆయిల్ మస్సాజ్ చేస్తుంటే రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా డేండ్రఫ్ తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story