కాల్షియం శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే కాల్షియం మన ఎముకలను బలంగా ఉంచుతుంది.
శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారడమే కాదు..ఇతర వ్యాధులు కూడా మొదలవుతాయి.
మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఈ డ్రింక్స్ పిల్లలకు తాగిస్తే ఎముకలు బలంగా మారుతాయి. ఆ డ్రింక్స్ ఏవో చూద్దాం.
మీరు కాల్షియం లోపాన్ని అధిగమించాలనుకుంటే పాలు తాగాలి. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.
మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీరు బాదం పాలు తాగాలి. ఇందులో మొక్కల ఆధారిత కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
100 గ్రాముల సోయా పాలలో 25 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. సోయా పాలు ఎముకలను బలంగా ఉంచుతాయి.
మీరు చియా సీడ్స్ డ్రింక్ కూడా తాగవచ్చు. ఎందుకంటే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.
ప్రొటీన్ పౌడర్ ను పాలలో కలుపుకుని తాగితే ఎముకలు బలంగా ఉంటాయి.