నేరేడు పండ్లతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. కిడ్నీ, లివర్ సహా ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..
నేరేడు పండ్లు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయ పడుతోంది. బీపీ, షుగర్ ను కంట్రోల్ ఉంచడానికీ నేరేడు పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.
నేరేడు పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కంటి శుక్లాలకు సంబంధించిన రుగ్మతలు తొలిగిపోతాయి.
ధూమపానం వలన కలిగే నష్టాలను నివారిస్తోంది. అంతేకాదు చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.
అంతేకాదు వృద్దాప్య ఛాయలు రాకుండా నేరేడు పండ్లు దోహదం చేస్తాయి.
నేరేడు పండ్లలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తోంది.
నేరేడు పండ్లలోని విటమిన్ సితో ఇన్ఫెక్షన్ తో పాటు రోగ నిరోధక వ్యవస్థను కాపాడంలో సహాయ పడుతోంది.
నేరేడు పండ్లు.. జీర్ణ వ్యవస్థతో పాటు మల బద్దకాన్ని నివారించడంలో సహాయపడుతోంది. జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టడంలో నేరేడు పండ్లు ఎందో దోహదం చేస్తాయి.
చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి నేరేడు పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. రెగ్యులర్ గా ఈ పండ్లను తీసుకోవడం వలన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కణాలను కాపాడటంలో దోహదం చేస్తోంది.