ఈ చూడ్డానికి క్రీమీ గా, స్పైసీగా ఉంటుంది.
ముందుగా గుడ్లు అన్నిటిని ఉడకబెట్టాలి.
ఇప్పుడు గుడ్లను రెండు భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి కాసేపు చిటపటలాడించాలి.
ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి
ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు వేసుకొని మరికొద్ది సేపు ఉడికించుకోవాలి
ఆ తర్వాత ఇందులో కొబ్బరి పాలు కూడా వేసి సరిపోయినన్ని నీళ్లు పోసుకుని సిమ్ లో పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఇందులో ఉడకబెట్టిన గుడ్లు వేసి మరో 15 నిమిషాల పాటు సిమ్లో మరిగించుకోవాలి.
చివరగా ఇందులో గరం మసాలా వేసి మరో 3 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి కేరళ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ.