పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ.. ప్యాకెట్ పాలు వల్ల కలిగే నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి.. చిన్నప్పటి నుంచి పిల్లలకు పాలు ఇవ్వాలని డాక్టర్లు తప్పకుండా సూచిస్తూ ఉంటారు.
ఎందుకంటే పిల్లలు రోజు కనీసం క్లాసు పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. అలానే పాలు తాగడం వల్ల మన శరీరంలకి కాల్షియం, విటమిన్ డి బాగా అందుతాయి.
నిస్సందేహంగా, పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కానీ ప్యాకెట్ పాలు మాత్రం రోజుకి అధిక శాతం తీసుకోకూడదు అని చెబుతున్నాయి కొన్ని సర్వేలు.
రోజులో ఎక్కువగా పాలు ప్యాకెట్ తీసుకోవడం వల్ల కూడా కొంత హాని కలుగుతుంది.
అసలు విషయానికి వస్తే హెల్త్‌షాట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల ప్యాకెట్ పాలు తీసుకునే గుంద సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతారు.
అంతేకాదు ప్యాకెట్ పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా 44 శాతం పెంచుతుంది అని చెబుతున్నారు.