పొన్నగంటి కూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. దీనిని శాస్త్రీయంగా ఆయుర్వేదంలో పోయిన కంటికూర అని కూడా పిలుస్తారు అంటే కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా చెప్పవచ్చు
ఎవరైతే దృష్టిలోపంతో బాధపడుతూ ఉంటారో వారికి పొన్నగంటి కూర చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు
పొన్నగంటి కూరను పప్పు చేసుకొని తినవచ్చు కందిపప్పు పొన్నగంటి కూర కలిపి రుచికరమైన పప్పు తయారు చేసుకోవచ్చు
పొన్నగంటి కూరలో విటమిన్ ఏతో పాటు ఫాస్ఫరస్ మెగ్నీషియం కాపర్ జింక్ పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా బీపీతో బాధపడే వారికి పొన్నగంటి కూర చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు
పొన్నగంటి కూరలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. మీరు జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు అయితే ఈ కూరను తీసుకోవడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు
మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే పొన్నగంటి కూరతో చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు
మీరు రక్త మొలలతో బాధపడుతున్నట్లు అయితే పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారం లభించే అవకాశం ఉంది ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉండడం కారణంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు
పొన్నగంటి కూరను కేవలం పప్పుగా మాత్రమే కాదు. రోటి పచ్చడి కూడా చేసుకొని తినవచ్చు తద్వారా చాలా రుచికరమైన ఆహారం తయారవుతుంది
పొన్నగంటి కూరలో పోషకాలను కోల్పోకుండా ఉండాలంటే కూరను కట్ చేసిన అనంతరం నీళ్లల్లో కడగకూడదు ముందుగానే నీళ్లలో కడిగి ఆ తర్వాత కూరను కట్ చేసుకోవాల్సి ఉంటుంది