కళ్ల కింద నలుపు అనేది చాలా మందికి వచ్చే సాధారణ సమస్య. ముఖ్యంగా ఈ తరం వారిలో.. జీవనశైలి వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే.. సరైన పరిష్కారాలను ప్రయత్నించడం చాలా ముఖ్యం.
కళ్ల కింద నలుపు తగ్గాలంటే.. ఇంటి దగ్గరే సులభంగా చేయగలిగే.. చిట్కాలను పాటించడం మంచిది.
ఒక గ్లాస్ మంచినీటిలో చల్లని స్పూన్ ఉంచి, రాత్రి పడుకునే ముందు..ఆ స్పూన్‌ను కళ్లపై 10 నిమిషాలు ఉంచండి. ఇది కళ్ల కింద నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది.
తరచూ కళ్ల కింద నలుపు వస్తే, కీర్ స్లైసులను కళ్లపై పెట్టండి. రాత్రి నిద్ర పోయేటప్పుడు అది అలానే పెట్టి పడుకోండి. కీర్‌లో ఉండే తేమ చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. కళ్ల కింద నలుపును తగ్గిస్తుంది.
అలోవెరా జెల్‌ను రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ మర్దన చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి, కళ్ల కింద నలుపును పోగొడుతుంది.
బాదం నూనెను కళ్ల చుట్టూ అప్లై చేసి నిద్రపోవడం వల్ల కళ్ల కింద నలుపు తగ్గుతుంది, కంటి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.