ఎంతోమంది గోబీ 65, పన్నీర్ 65 ఇష్టంగా తింటూ ఉంటారు.. అలాంటివారు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ఈ ఆలు 65 తిని చూడండి..
ముందుగా అరకిలో బంగాళాదుంపలు గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ మీద ఉడక పెట్టుకోండి హ
నీళ్లలో కొంచెం ఉప్పు వేసుకొని.. బంగాళాదుంపలు 70% దాకా ఉడికేటట్టు చూసుకోవాలి.
ఆ తరువాత ఆలు పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి..
ఒక గిన్నెలో ఈ ముక్కలు తీసుకొని అందులో రెండు స్పూన్ల మైదా, రెండు స్పూన్ల బియ్యప్పిండి, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.
అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అరె స్పూన్ ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి కలపాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి.. నూనె వేసి నూనె వేడెక్కాక.. బంగాళాదుంపలు పొడిపొడిగా వేసుకోండి.
అవి గోధుమ రంగు వచ్చాక వాటిని నూనెలో ఉంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పైన మీద మరో కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బల తరుగు, 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
అందులోనే అర కప్పు పెరుగు, చిటికెడు ఉప్పు, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేయాలి.
ఇందులో ఫైనల్ గా వేయించి పెట్టుకున్న ఆలుదుంపలు వేసి చివరిగా..కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.అంతే టేస్టీ ఆలూ 65 రెడీ.