ఎంతో రుచికరంగా చేసుకునే…గీ రోస్ట్ ఎగ్ కర్రీ తయారీ విధానం ఒకసారి చూద్దాం
ఘీ రోస్ట్ ఎగ్ కర్రీ తయారీ కోసం ముందుగా కోడిగుడ్లని ఉడికించి పెట్టుకోండి.
ఆ తరువాత వాటి తొక్క తీసి పక్కనపెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె రెండు టేబుల్ స్పూన్లు పోసి, ఆపై నెయ్యి కూడా వేసి వేడిచేయాలి.
నెయ్యి బాగా వేడయ్యాక అందులో గుడ్లను వేసి వేయించుకోండి.
ఆ తరువాత కోడిగుడ్లను పక్కకు తీసి అదే కడాయిలో ¼ స్పూన్ జీలకర్ర, ఒక్క బిర్యానీ ఆకు, రెండు ఏలకులు వేయండి.
ఆ తర్వాత తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ బాగా వేగాక అర స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు తరిగిన రెండు టమోటాలు వేసి కొంచెం పసుపు, ఉప్పు, ¼ స్పూన్ ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడులు వేసి వేయించాలి.
టొమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత తాజా అర కప్పు పెరుగు వేసి ఉడికించుకోవాలి.
ఆ తరువాత కొంచెం నీళ్లు పోసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి. రసం మరిగిన తర్వాత గుడ్లకు గాట్లు పెట్టి ఇందులో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన గీ రోస్ట్ ఎగ్ కర్రీ రెడీ..