హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న కొన్ని అందమైన జలపాతాలు..

';

ఎత్తిపోతల జలపాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉంది. నాగార్జునసాగర్ నుంచి మాచర్ల వెళ్లే దారిలో, 11 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం కనిపిస్తుంది. హైదరాబాద్‌ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

';

మల్లెల తీర్థం జలపాతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ జలపాతం మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది.

';

భీముని పాదం అనేది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో 1౦ కిల్లోమీటర్ల దూరంలో ఉంది. పాండవులు అజ్ఞాతవాసం గడుపుతున్న సమయంలో, ఒకసారి భీముడు ఈ ప్రాంతానికి వచ్చి, తన దాహాన్ని తీర్చుకోవడానికి ఒక శిలపై తన పాదాన్ని నొక్కినట్లు చెబుతారు.

';

బొగత జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, కొండలకు చాలా అందంగా ఉంటుంది.

';

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో పొచ్చెర జలపాతం ఉంది. ఇది చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి ఎగసిపడే అందమైన జలపాతం.

';

గాయత్రి జలపాతం ఒక అందమైన ప్రకృతి అద్భుతం. హైదరాబాద్‌ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతాలు ఉన్నాయి. సుమారు 70 మీటర్ల ఎత్తు నుండి కిందకు జాలువారుతూ, చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది.

';

సహస్రకుండ్ జలపాతం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పెయింగాంగా నదిపై ఉన్న జలపాతం. హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. 200 అడుగుల ఎత్తు నుంచి పడిపోయే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది.

';

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని అజలాపురం గ్రామంలో ఈ అందమైన జలపాతం ఉంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల సమీపంలో ఉంది.

';

VIEW ALL

Read Next Story