కోవిడ్ కాలం మళ్లీ రాబోతోందా? ఇమ్యూనిటీని పెంచే ఈ ఆహారాలు డైట్లో చేర్చుకోండి

Bhoomi
Jan 06,2025
';

రోగనిరోధకశక్తి

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. బయట నుంచి శరీరంలోకి చేరే బ్యాక్టీరియా, వైరస్ లు, క్రీముల నుంచి రక్షణ పొందాలటే ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండాలి.

';

ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మరి ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏవో చూద్దామా

';

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.విటమిన్ సి పెంచుకునేందుకు ఆరెంజ్ జ్యూస్, గ్రేప్స్, నిమ్మరసం, సిట్రస్ బెర్రీలు మొదలైన పండ్లు తినాలి.

';

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజూ బ్రోకలీ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';

వెల్లుల్లి

వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంటి వంటకు మంచి రుచితోపాటు సువాసనను అందిస్తుంది. జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో ఉన్నాయి.

';

అల్లం

అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, ఎన్నో మినరల్స్ ఉన్నాయి. దగ్గు, గొంతునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

';

పసుపు

నిత్యం ఇంట్లో వంటకాల్లో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. ఎన్నో రకాల అంటు వ్యాధులతో పోరాడుతుంది. ఇందులోని కర్కుమిన్ సమ్మేళం అంటువ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది

';

వీటికి దూరంగా

చాలా మంది బయటి ఆహారం, శీతలపానీయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వీటిని పూర్తిగా దూరం చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

';

Disclaimer

ఈ సమాచారం కేవలం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో ఏవైనా కొత్త పదార్థాలను చేర్చుకునే ముందు వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story