ఖర్చు లేకుండా హాయిగా దోస తింటూ బరువు తగ్గొచ్చు!

';

ప్రతి రోజు జొన్న దోస తింటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.

';

ముఖ్యంగా జొన్న దోస తినడం వల్ల జీర్ణక్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది.

';

అంతేకాకుండా దీనిని తింటే సులభంగా బరువు కూడా తగ్గుతారు.

';

ముఖ్యంగా ప్రతి రోజు జొన్న దోసను తినడం వల్ల చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

మీరు కూడా ఈ జొన్న దోసను తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

జొన్న దోసకు కావలసిన పదార్థాలు: జొన్న పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి

';

తయారీ విధానం..పిండిని కలపడం: ఒక పాత్రలో జొన్న పిండిని తీసుకొని అందులో నీటిని వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దోసపిండిలా తయారు అయ్యేంత వరకు మిక్స్‌ చేసుకోవాలి.

';

ఉప్పు కలపడం: పిండిలో ఉప్పును వేసుకుని బాగా కలపండి. పిండి పలుచగా లేదా గట్టిగా ఉండకుండా సరైన మోతాదులో ఉండేంత వరకు బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని విశ్రమించనివ్వడం: పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిండిలోని పోషకాలు బాగా విడుదలవుతాయి.

';

దోస వేయడం: తవాను మంట మీద వేడి చేసి.. కొంచెం నూనె రాసి, తగినంత పిండిని తీసుకొని దోసను వేయండి.

';

తిరగేయడం: ఒక వైపు వేగిన తర్వాత మరో వైపు తిప్పి వేయండి. కావాలనుకుంటే వీటిపై చిన్న చిన్న కూరగాయల ముక్కలను కూడా వేసుకోవచ్చు.

';

సర్వ్ చేయడం: రెండు వైపులా బాగా వేగిన తర్వాత దోసను తీసి, మీకు ఇష్టమైన చట్నీ లేదా సాంబార్‌తో తినండి..

';

VIEW ALL

Read Next Story