ఓట్స్ లో పీచు పదార్థం ఎక్కువ ఉండడంవల్ల.. ఓట్స్ తో చేసిన పదార్థాలు మనం ఏది తిన్న సరే..ఐది బరువుని పెరగడం అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. మరి అలాంటి ఓట్స్ తో ఉతప్పం ఎలా చేసుకోవాలో చూద్దాం.
ముందుగా ఒక మిక్సర్ జార్ లో.. ఒక కప్పు ఓట్స్, అర కప్పు బొంబాయి రవ్వను.. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని.. ఒక పాత్రలో వేసుకొని అందులో పెరుగును వేసుకుని కలుపుకోవాలి.
తరువాత అందులో ఒక చిన్న ముక్క అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను వంట సోడా వేసుకోవాలి.
తరువాత రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద దోస పాన్ పెటి..వేడయ్యాక ఈ దోస పిండిని వేసుకొని దానిపైన క్యారెట్ తురుము.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను, వేసుకొని కాల్చుకోవాలి.
రెండు నిమిషాలు తర్వాత.. రెండో పక్క కూడా ఊతప్పంను కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఓట్ ఉత్తాపం రెడీ.