బరువును ఎంతో స్పీడుగా తగ్గించే ఈ రెసిపీ మీకు తెలుసా?

';

నిజానికి ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

';

ముఖ్యంగా ఓట్స్ను ఉడకబెట్టి దాని నుంచి తీసిన గంజిని ఉదయం పూట తాగడం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.

';

అలాగే ఈ గంజిని ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా ఎంతో సులభంగా తగ్గుతుందట.

';

మీరు కూడా సులభంగా శరీర బరువు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా గంజి రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1/2 కప్పు, పాలు - 2 కప్పులు, నీరు - 1 కప్పు, ఉల్లిపాయ - 1(తరిగినవి), టమోటా - 1 (తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, పచ్చిమిర్చి - 2, తరిగినవి, కరివేపాకు - 1 రెమ్మ

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1/2 టీస్పూన్, సోంపు - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్, తరిగినది

';

తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర, సోంపు వేసి వేయించాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత అందులోనే టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

';

బాగా కలిపిన తర్వాత ఓట్స్ను ఉడికించి తీసుకున్న నీటిని వేరుచేసి, పైన వేయించుకున్న మిశ్రమంలో వాటిని పోసుకోవాలి. అలాగే ఇందులో పాలు వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఓట్స్ వాటర్ నుంచి మంచి సువాసన వచ్చేంతవరకు బాగా మరిగించుకోవాలి.

';

ఇలా మరిగించుకున్న గంజిలో తగినంత కొత్తిమీర పుదీనా వేసుకొని మరో నిమిషం వరకు బాగా ఉడికించాల్సి ఉంటుంది. అంతే ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..

';

VIEW ALL

Read Next Story