అయితే ఇలాంటి సమాజంలో అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది కొంతమంది అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు జరగడంలో అమ్మాయిలు తప్పులు లేకపోయినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. కనీసం కొంతవరకైనా మన చుట్టూ జరిగే చెడు సంఘటనలను తప్పించుకోవచ్చు.
ముఖ్యంగా అమ్మాయిలు ఫోన్ వాడే వినియోగంలో జాగ్రత్తలు అవసరం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
సోషల్ మీడియాలో తెలియని అబ్బాయిల దగ్గర నుంచి వచ్చే రిక్వెస్టులు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం మంచిది. అంతేకాదు వారు ఎలాంటి వారో తెలియకుండా చాటింగ్ చెయ్యడం మంచి పని కాదు. ఎందుకంటే ఇక్కడ మోసాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంది.
తెలియని వారిని గుడ్డిగా నమ్మవద్దు. అంతేకాదు మీతో స్నేహం చేసే అబ్బాయిల ప్రవర్తనలో మార్పు వస్తే.. వారు మీకు నచ్చకపోతే.. వారిని దూరం పెట్టడం మంచిది.
అలానే మీ చుట్టూ ఉన్న వారిలో మీకు ఎవరన్నా తేడాగా అనిపిస్తే.. వారి గురించి అమ్మా, నాన్నకి లేదా మీరు బాగా నమ్మే స్నేహితులకన్నా చెప్పి పెట్టడం ఉత్తమమైన పని.
మీ స్కూల్లో, కాలేజీల్లో అబ్బాయిలనే కాదు..కొన్నిసార్లు బంధువులు, ఇంట్లో వారి నడవడికనూ కూడా గమనిస్తూ ఉండటం బెటర్. వారిలో ఎవరన్నా మీ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించడం ఉత్తమం.
మహిళల భద్రతకు టోల్ ఫ్రీ నంబర్ : 112/ 181, అలానే మీ ఫోన్లో షి యాప్.. ఇవన్నీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమైన పని.