పందెంలో ఓడిపోయిన గరుడ తల్లి వినత.. కద్రకు బానిసగా మారుతుంది. తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని గరుడ వారిని కోరతాడు. స్వర్గం నుంచి అమృతం తీసుకురావాలని వాళ్లు కండీషన్ పెడతారు.
పాములు అన్నీ అమృతం తాగేందుకు రాగా.. ముందు స్నానం చేసి రావాలని గరుడ చెబుతాడు. పాములు స్నానానికి వెళ్లగా.. ఈలోపు ఇంద్రుడు వచ్చి అమృతం కుండతో స్వర్గానికి తిరిగి వెళ్లిపోతాడు.
స్నానం చేసి అక్కడివచ్చిన పాములకు కుండ కనిపించదు. అమృత కుండ కోసం గడ్డిపై వెతుకుతాయి. గడ్డి పదునుగా ఉండడంతో నాలుక రెండు భాగాలుగా వీడిపోయిందని పురణాల ప్రకారం ఉంది.