పాములు పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..!

user Ashok Krindinti
user Jan 21,2025

పాముల పేరు వింటేనే చాలామంది భయపడిపోతారు.

ఇక పాములు ఎదురుపడితే.. అటు నుంచి అటే పారిపోతారు.

అయితే మనుషులను భయపెట్టే పాముల కూడా ఓ విషయానికి భయపడతాయి.

మన దేశంలో పాములకు పాలు పోసే సంప్రదాయం ఎప్పటి నుంచో విన్న విషయం తెలిసిందే.

కానీ పాములకు పాలు పోయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పాలు పాములకు విషం లాంటివని.. పాలు తాగితే వాటి ప్రాణం కూడా పోతుందని అంటున్నారు.

నిజానికి పాముల శరీరంలో పాలను జీర్ణం చేయడానికి ఎంజైములు ఉండవని చెబుతున్నారు. పాలు తాగితే.. వాటి ఊపిరితిత్తులు, ప్రేగులు దెబ్బతింటాయి.

పాలు ఊపిరితిత్తుల్లో చేరితే.. వాటికి న్యుమోనియా వస్తుంది. దీంతో ప్రాణాలను కోల్పోతుంది.

సినిమాల్లో చూపించిన విధంగా నిజ జీవితంలో పాములు పాలు తాగవని నిపుణులు అంటున్నారు.

VIEW ALL

Read Next Story