వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు తయారు చేయడం కోసం.. ముందుగా స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి.
నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో అర కప్పు బెల్లం వేసుకుని కరగనివ్వాలి.
ఆ తరువాత నీళ్లని మొత్తం వరకట్టుకొని బెల్లం కాసేపు పొయ్యి మీద పెట్టుకోవాలి.
అందులో పావు కప్పు తాజా కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి వేసి ఉడికించాలి.
కొబ్బరి తురుము దగ్గర పడుతున్నప్పుడు.. కొద్దికొద్దిగా ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.
మూత మూసి మూడు నిమిషాలు ఉడికించాలి. చివరిగా చేతికి నెయ్యి రాసుకుని.. కొద్దిగా పిండి ముద్ద తీసుకుని కుడుముల్లాగా చుట్టుకోవాలి.
ఆ తరువాత ఇడ్లీ ప్లేట్ తీసుకుని.. నెయ్యి రాసి.. మనం ముందుగా చేసుకున్న బియ్యం ప్లేట్లలో పెట్టుకోవాలి. ఇవి పది నిమిషాల పాటు ఉడికితే.. బెల్లం కుడుములు సిద్ధమైనట్లే.