స్త్రీ అంటేనే అదృష్టానికి చిహ్నం. అలాంటి స్త్రీ దేహంపై కొన్నిచోట్ల పుట్టుమచ్చ ఉంటే అత్యంత శుభంగా భావిస్తారు.
మహిళల దేహంపై ఉండే కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చలు ఆ మహిళ ఎంత అదృష్టవంతురాలో, ఎంత శక్తివంతమైందో చెబుతాయంటారు
ముక్కు ఎగువ భాగంలో పుట్టుమచ్చ లేదా మస్కా ఉంటే అదృష్టం ఆమెతోనే ఉంటుందని అర్ధం
వీపుపై పుట్టుమచ్చ కలిగిన మహిళలు భర్త అదృష్టానికి, విజయానికి కారకులౌతారు
గొంతుపై పుట్టుమచ్చ ఉంటే అత్యంత ధైర్యవంతురాలని అర్ధం. ఇలాంటి స్త్రీ తన ధైర్యంతో కలల్ని సాకారం చేసుకుంటుంది.
నడుము, గెడ్డంపై పుట్టుమచ్చ ఉండే మహిళలు చాలా అదృష్టవంతురాలనడంలో సందేహం లేదు
కుడి చేయి లేదా ఎడమ చేతి చంకలో పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళ అత్యంత సౌభాగ్యవంతురాలు
కడుపుపై పుట్టుమచ్చ ఉండే మహిళలు జీవితంలో సహజంగా, సురక్షితంగా ఉంటారు. ఎలాంటి భయం ఉండదు