మాస్టర్ బాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ వన్డేల్లో భారత్ తరపున 62 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు.
ఈ లిస్ట్ లో కింగ్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు టీమిండియా తరపున 41 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో దాదా 31 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
టీమిండియా తరఫున వన్డేల్లో 27 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న యువరాజ్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో రోహిత్ శర్మ 24 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
భారత్ తరఫున వన్డేల్లో 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును వీరేంద్ర సెహ్వాగ్ గెలుచుకున్నాడు.
వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోనీ 21 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ భారత్ తరఫున వన్డేల్లో 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
భారత్ తరఫున వన్డేల్లో రాహుల్ ద్రవిడ్ 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారత్ తరఫున వన్డేల్లో 13 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.