తుషార్ దేశ్‌పాండే

ఐపీఎల్ 2024 సీజన్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తొలి బంతికే వికెట్ తీశాడు. అతడు ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

';

మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌:

ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన తొలి బౌలర్‌ ఇతను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారు.

';

ఇంతకు ముందు 30 మంది బౌలర్లు ఇలా తొలి బంతికే వికెట్ తీశారు. అయితే ఈ ఘనత రెండుసార్లు సాధించిన బౌలర్లు ఐదుగురు ఉన్నారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ పాకిస్థాన్‌కు చెందిన సోహైల్ తన్వీర్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

';

ఐపీఎల్ మ్యాచ్‌లో రెండుసార్లు తొలి బంతికే వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్ల గురించి తెలుసుకుందాం.

';

లసిత్ మలింగ

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లసిత్ మలింగ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.

';

ఉమేష్ యాదవ్

ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా ఐపీఎల్ మ్యాచ్ మొదటి బంతికే వికెట్ తీశాడు. ఇలా కూడా రెండు సార్లు చేశాడు.

';

భువనేశ్వర్ కుమార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్ మ్యాచ్‌లో రెండుసార్లు తొలి బంతికే వికెట్ తీశాడు.

';

డిర్క్ నాన్స్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డిర్క్ నాన్స్ కూడా ఇలా రెండు సార్లు చేశాడు.

';

మహ్మద్ షమీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా రెండుసార్లు ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఘనత సాధించాడు.

';

VIEW ALL

Read Next Story