ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్.
సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 277 పరుగుల రికార్డును కేకేఆర్ బద్దలు కొట్టలేకపోయింది.
ఐపీఎల్‌లో వారంలో 270 పరుగుల స్కోరు రెండుసార్లు దాటింది. సన్‌రైజర్స్ దీన్ని మార్చి 27న, కోల్‌కతా ఏప్రిల్ 3న దీన్ని చేశాయి.
పీఎల్ మూడవ అత్యధిక స్కోరు ఆర్సీబీ పేరు మీద ఉంది. ఆ జట్టు 2013లో పూణే వారియర్స్‌పై 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో నాల్గవ పెద్ద స్కోరు లక్నో సూపర్ జెయింట్స్ పేరిట ఉంది. వారు 2023లో పంజాబ్ కింగ్స్‌పై 5 వికెట్లకు 257 పరుగులు చేశారు.
2016లో గుజరాత్ లయన్స్‌పై ఆర్సీబీ 3 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇది ఐదవ అతిపెద్ద స్కోరు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో తన తొలి ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
ఆండ్రీ రస్సెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు.