మార్చి 24న లక్నో సూపర్ జెయింట్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

';

జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

';

ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు శాంసన్.

';

ఇందులో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ 157.69.

';

రికార్డు: 2020 నుంచి ప్రతి సంవత్సరం ఆడిన ప్రతి సీజన్ తొలి మ్యాచ్ లో శాంసన్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి.

';

2020లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో 32 బంతుల్లో 74 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

';

2021లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన జట్టు తొలి మ్యాచ్‌లో శాంసన్ 63 బంతుల్లో 119 పరుగులు చేశాడు.

';

2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మెుదటి మ్యాచ్‌లో శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

';

2023లోనూ రాజస్థాన్ తన ఫస్ట్ మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. ఈ మ్యాచ్ లో కూడా సంజూ 32 బంతుల్లో 55 పరుగులు చేశారు.

';

తాజాగా 2024 సీజన్ లో కూడా లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శాంసన్ 52 బంతుల్లో 82* పరుగులు చేశాడు.

';

VIEW ALL

Read Next Story