Today Rasi Phalalu: మీ జాతకం తెలుసా.. ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..?

';

Today Horoscope Of All Zodiac Signs

శనివారం మృగశిర నక్షత్రం, సుకర్మ యోగం సందర్భంగా కొన్ని రాశుల శుభప్రదంగా ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు రాశిఫలం గురించి తెలుసుకోండి.

';

మేష రాశి

మేష రాశి వారికి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. శ్రద్ధగా పని చేస్తే.. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారం రంగంలో ఉన్న వారు తమ భాగస్వాములకు కూడా బాధ్యతలు అప్పగించాలి.

';

వృషభం

వృషభ రాశి వారు యాక్టివ్‌గా పనిచేయండి. ఇతరులతో మర్యాదగా వ్యవహరించండి. వ్యాపారస్తులు రుణాలు తీసుకోవడానికి అనువైన సమయం కాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోండి.

';

మిధున రాశి

ఉద్యోగస్తులకు సహచరుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార రంగాలకు వారికి కలిసి వస్తుంది. విలాసాలకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

';

కర్కాటకం

కర్కాటకం రాశి వారు చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి. లేకపోతే అనవసరమైన వివాదాల్లో మీరు చిక్కుకోవాల్సి ఉంటుంది. మీరు చేయాల్సి పనుల జాబితాను సిద్ధం చేసుకుని.. ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేయండి.

';

సింహం

సింహ రాశి వారికి పనిలో ఆసక్తి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బట్టలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు.

';

కన్య రాశి

కన్య రాశి వారు తాము పని చేస్తున్న ఆఫీసులో యజమాని పట్ల అంకితభావంతో ఉండండి. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. సంపాదన కూడా బాగుంటుంది కానీ ఒత్తిడి ఉండవచ్చు.

';

తుల రాశి

తుల రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానకి బ్రాండింగ్‌పై ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేయండి. పెద్దలను గౌరవించండి.

';

వృశ్చికం

ఉద్యోగులు నిరుత్సాహానికి గురతారు. ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు అడుగు వేయండి. మీపై నిందలు వేసేందుకు మీ పక్కనే కొందరు సిద్ధంగా ఉన్నారు. వ్యాపారస్తులు బిజీగా ఉంటారు. ఒత్తిడికి గురికాకండి. ఆరోగ్ విషయంలో జాగ్రత్త పాటించండి.

';

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆఫీసులలో సహోద్యోగుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. దీంతో పనులు ఈజీగా పూర్తవుతాయి. భాగస్వామ్యంతో పనిచేసే వారికి లాభిస్తుంది. ప్రేమ జీవితం, ఆరోగ్యం బాగుంటుంది.

';

మకరరాశి

మకరరాశి వారు పని విషయంలో కష్టపడాల్సి ఉంటుంది. లేదంటే మీ పరువు తీసే అవకాశం ఉంది. మొబైల్‌లో టైమ్ వేస్ట్ చేసుకోకండి.

';

కుంభం

ఈ రాశి వారు పని విషయంలో తెలివితో వ్యవహరించండి. అప్పుడే పూర్తి విజయం లభిస్తుంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

';

మీన రాశి

మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వారు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలి. ఆశించిన లాభాల్లో ఉంటాయి. సోషల్ మీడియా వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు.

';

VIEW ALL

Read Next Story