)
116 Years old world oldest living Ethel Caterham health secret: ఇటీవల కాలంలో చాలా మంది 60లు దాటడమే గగనమైందని చెప్పుకొవచ్చు. ఒకప్పుడు నలభైల తర్వాత వచ్చే వ్యాధులు ఇప్పుడైతే టీనేజ్ లో, 10 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయి. బీపీలు, షుగర్ లు, గుండె బబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలో కన్పిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు లైఫ్ స్టైల్ లో మార్పులు, ఆర్థిక సమస్యలు, బైట గొడవలు, వర్క్ ప్రెషర్ మొదలైన వాటి వల్ల చాలా మంది తీవ్రమైన ఒత్తిడిలకు గురౌతున్నారు. దీంతో చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
చాలా మంది ఇటీవల కాస్తంత హెల్త్ పై కాన్సెన్ ట్రెషన్ చేస్తున్నారు. జిమ్ లు, యోగాలు, మొదలైనవి చేస్తున్నారు. ప్రాపర్ డైట్ లను ఫాలో అవుతున్నారు. దీంతో జీవక్రియలు యాక్టివ్ గా మారి రోగాలు అన్ని దూరమౌతాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో .. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన 116 ఏళ్ల ఎథెల్ క్యాటర్‌హామ్... ఇటీవల తన హెల్త్ సీక్రెట్ ను బైటపెట్టింది. తాను వ్యాయామమో, కఠినమైన ఆహార నియమాలు మాత్రం అస్సలు పాటించనని చెప్పింది. కానీ... ఎవరితోనూ వాదించకుండా, ప్రశాంతంగా ఉంటూ.. మనసుకు నచ్చిన పనులు చేస్తానంటూ తెలిపింది. దీంతో తన హెల్త్ తన కంట్రోల్ లో ఉంటుందని, ఒత్తిడికి గురికానని చెప్పింది.
1909 ఆగస్టు 21న ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించిన ఎథెల్ క్యాటర్హామ్ను, ఈ ఏడాది (2025) ఆరంభంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలిగా గుర్తించింది. బ్రెజిల్‌కు చెందిన రికార్డు హోల్డర్ ఇనా కనబరో మరణం తర్వాత ఈ గౌరవం ఆమెకు దక్కింది. ఎథెల్ క్యాటర్హామ్ను.. కేవలం 18 ఏళ్ల వయసులోనే తన గ్రామాన్ని విడిచిపెట్టి, 1927లో భారతదేశంలో ముగ్గురు పిల్లలకు ఆయాగా పనిచేసింది.
ఆ తర్వాత ఆమె బ్రిటిష్ ఆర్మీ అధికారి నార్మన్ క్యాటర్హామ్ను వివాహం చేసుకుని హాంకాంగ్, జిబ్రాల్టర్లలో ఉన్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత.. ఆమెకు ముగ్గురు మనవళ్లు, ఐదుగురు మునిమనవళ్లు ఉన్నారు. కూతుర్లు ఇద్దరు కూడా చనిపోయారు.
రెండు ప్రపంచ యుద్ధాలు, బ్రిటన్ను ఏలిన ఆరుగురు రాజులు, 27 మంది ప్రధాన మంత్రుల పాలనను ఆమె కళ్లారా చూశారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. కరోనా మహామ్మారి ఆమెకు సోకినప్పుడు ఆమె వయస్సు.. 111 ఏళ్లు. కేవలం గొడవలు, ఆర్గుమెంట్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటంతో ఇప్పటికి కూడా హెల్తీగా ఉన్నానని ఎథెల్ క్యాటర్‌హామ్ తన హెల్త్ సీక్రెట్ బైటపెట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook