close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ట్రంప్ పరువు తీసిన పదహారేళ్ల అమ్మాయి !!

తప్పు చేసినపుడు అవతలి వ్యక్తి ఏవరైతే ఏంటి ..అంటోంది  16 ఏళ్ల గ్రెటా టూన్ బర్గ్  .

Updated: Aug 14, 2019, 02:17 PM IST
ట్రంప్ పరువు తీసిన పదహారేళ్ల అమ్మాయి !!

అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాల పాలకులకు సైతం హడల్.. ఆయన్ను సవాల్ చేయడమంటే ప్రపంచదేశాలు సైతం సాహసం చేయబోవు... ఆయనకు వ్యతిరేకంగా కామెంట్ చేయలేని పరిస్థితి. అలాంటి అగ్రరాజ్య అధ్యకుడికి  ఏమాత్రం లెక్కలోకి తీసకోవడం లేదు ఆ పదహారేళ్ల అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి...ఇంతకీ ట్రంప్ ప్రస్తావన ఎందుకు తెచ్చింది అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే

పర్యావరణ పరిరక్ష  కోసం పోరుబాట
స్వీడన్ కు 16 ఏళ్ల గ్రెటా టూన్ బర్గ్  పర్యావరణ పరిరక్ష కోసం  ఉద్యమబాట పట్టింది. ఈ క్రమంలో కాలుష్య ఉద్గారాల నియంత్రణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న గ్రెటా.. ఈ అంశంపై ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఈ క్రమంలో అమెరికాను ప్రశ్నించే చర్యలో భాగంగా యూరప్ నుంచి అమెరికాకు ఓ సోలార్ బోటులో ప్రయాణం మొదలుపెట్టింది.ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో ట్రంప్ సర్కార్ సరైన కృషి చేయడం లేదని గ్రేటా విమర్శలు సంధించింది. 

మీడియ ప్రశ్నలుకు ఘాటైన రిప్లై
ఈ సందర్భంగా ఆమెతో  మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలుసుకుంటారా? అంటూ ప్రశ్నించగా... గ్రెటా టూన్ బర్గ్  బదులిస్తూ ఆయనతో మాట్లాడి నా సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి. ఎలాగూ ఆయన నేను చెప్పేదవి వినరు కదా ? అంటూ ట్రంప్ ను లైట్ కుంది. 

పారిస్ ఒప్పందాన్ని రద్దుపై మండిపాటు
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచదేశాలు ప్యారిస్ ఒప్పందం కుదుర్చుకోగా... ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవలె అమెరికా ప్రభుత్వం ప్రకటించింది . ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంపై తన అసంతృప్తి చేసిన  గ్రెటా టూన్ బర్గ్  ఈ మేరకు స్పందించింది.

Tags: