Tahawwur Rana: తహవ్వుర్ రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్‌జిత్ సింగ్ వాదనలను విన్నారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఏ కోరగా.. 18 రోజుల కస్టడీకి జస్టిస్ అనుమతించారు. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణా రాక సందర్భంగా ఎన్‌ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణా భారత్‌కు రాగానే N.I.A అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ పటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని NIA ప్రత్యేక కోర్టులో హాజరు పరిచాయరు. కోర్టు కస్టడీకి అనుమతించడంతో ఆతన్ని విచారణ నిమిత్తం NIA కేంద్ర కార్యాలయానికి తరలించారు.
తహవ్వుర్ రాణా అప్పగింత నేపథ‌్యంలో ముంబయి దాడుల కేసులో పటిష్టమైన వాదనలు వినిపించేందుకు కేంద్ర హోంశాఖ పటిష్టమైన లాయర్ల బృందాన్ని రెడీ చేసింది. రాణా అప్పగింత కోసం అమెరికా కోర్టులో వాదనలు వినిపించిన బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, N.I.A తరపున వాదనలకు నేతృత్వం వహించారు. మరో సీనియర్ క్రిమినల్ లాయర్ "నరేందర్ మాన్"ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కేంద్ర హోంశాఖ నియమించింది. దయాన్ కృష్ణన్‌కు నరేందర్ మాన్ సహాయ సహకారాలు అందించారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ముంబయి దాడులపై 2009 నవంబరు 1న ఢిల్లీలోని N.I.A పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వుర్ హుస్సేన్ రాణా, ఇతరులను నిందితులుగా చేర్చారు. రాణా, హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను కోరింది. దర్యాప్తులో సాయం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేసు దర్యాప్తు పూర్తిచేసిన N.I.A మొత్తం 9 మంది నిందితులపై 2011 డిసెంబర్ 24న పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని N.I.A న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. రాణా రాకతో ఆ కేసు విచారణలో వేగం పెరగనుంది.
రాణాను అమెరికా భారత్‌కు అప్పగించకముందే ముంబయి దాడుల కేసుకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఢిల్లీ కోర్టుకు చేరాయి. నవంబరు 26 దాడులపై ముంబయిలోనూ అనేక కేసులు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి విచారణ ఫైల్‌ను అక్కడికి పంపారు. రాణాను N.I.A కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ముంబయి దాడుల వెనక పాకిస్థాన్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయికి చేరుకుని సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు జరిగిన నాటి మారణహోమంలో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









