Trump Deadline: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా మరో అల్టీమేటం జారీ చేశారు. అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో నెలరోజులకు మించి నివసిస్తున్నవారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించాల్సిందేనని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే నేరం కింద పరిగణించి అపరాధ రుసుముతోపాటు జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడే మీరు సొంతంగా వెళ్లిపోండి అంటూ ఎక్స్ లో పోస్టు చేసింది.
అయితే సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గం. మీ సామాను సర్థుకుని ఫ్లైట్ ఎక్కండి..మీరు ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని బయలు దేరండి అంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారు విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లను కూడా చేసింది.
Also Read: Trump Tariffs: హమ్మయ్య.. ట్రంప్ వెనక్కి తగ్గాడు..సుంకాలు తగ్గించాడు.. దేనికంటే?
ఈ నిబంధనలు పాటించనట్లయితే తక్షణమే దేశం నుంచి పంపిస్తామని పేర్కొంది. అంతేకాదు ఫైనల్ ఆర్డర్ అందుకున్నవారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజు 998 డాలర్లు ఫైన్..సొంతంగా వెళ్లకపోతే 1,000 నుంచి 5000 డాలర్ల ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే ఛాన్స్ ఉందని..వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని పేర్కొంది.
Also Read: Mahindra: బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా అంకుల్.. ఆ మోడల్ కార్లపై 4లక్షల భారీ డిస్కౌంట్
ఈ నిర్ణయం నేరుగా హెచ్ 1 బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదని సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా హెచ్ 1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోయినట్లయితే..వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. విద్యార్థి, హెచ్ 1 బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









