)
Pavel Durov Net Worth: పాశ్చాత్య దేశాల్లో బంధాలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇష్టారీతిన బంధాలు ఉంటాయి. అలా ఓ వ్యక్తి పెళ్లి కాకుండానే వంద మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ముగ్గురితో డేటింగ్ చేస్తున్నాడు. ముగ్గురితో అంత మంది పిల్లలను కన్నాడా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే పిల్లలు కన్నది డేటింగ్ చేస్తున్న వారితో కాదు. అతడు దశాబ్ద కాలానికి పైగా వీర్యదానం చేస్తుండడంతో అతడు వందలాది పిల్లలకు తండ్రిగా మారాడు. అతడి వీర్యదానంతో 12 దేశాల్లో తన పిల్లలు ఉన్నారని చెప్పుకుంటున్నాడు. అతడెవరో కాదు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్. ఇటీవల తన మగతనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అవి ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్‌గా తండ్రిగా పావెల్ దురోవ్ గర్వంగా చెప్పుకుని తాను మగాడినని ప్రకటించుకున్నాడు. అయితే తాజాగా ఆ పిల్లలందరికీ తన సంపదను పంచుతానంటూ పావెల్ కీలక ప్రకటన చేశాడు. 15 ఏళ్ల పాటు పావెల్ వీర్యదానం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జులైలో ప్రకటించాడు. ఇటీవలే తాను వీలునామా రాశానని, వాటిలో ఈ వంద మంది పిల్లల గురించి కూడా రాసినట్లు పావెల్ వెల్లడించాడు.
తనకు సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు వీర్యదానంతో కలిగిన 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని పావెల్ దురోవ్ తెలిపాడు. దాదాపు 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో రాసినట్లు చెప్పాడు. తాను రాసిచ్చిన సంపదను 30 ఏళ్ల వరకు వారు పొందలేరని.. యుక్త వయసు వచ్చాక తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదిగేందుకు ఇలా రాసినట్లు పావెల్ వివరించాడు.
తనకు ఇప్పటివరకు వివాహం కాలేదని ప్రకటిస్తూనే.. ముగ్గురితో సహజీవనం చేస్తున్నట్లు పావెల్ దురోవ్ ప్రకటించాడు. ఆ ముగ్గురితో డేటింగ్ వలన ఆరుగురు సంతానం కలిగారని పావెల్ తెలిపాడు. వంద మందితో కలిపి మొత్తం 106 మంది పిల్లలు అని పావెల్ గర్వంగా చెబుతున్నాడు. 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయడానికి గల కారణాలను పావెల్ వివరించాడు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని, ఎంతోమంది శత్రువులు తనకు ఉండడంతోనే వీలునామా రాసినట్లు చెప్పాడు.
వీర్యదానంలో రికార్డు
ప్రపంచంలో వీర్యదానంలో పావెల్ రికార్డు నెలకొల్పాడు. అతడు వీర్యదానం చేయడం వలన ఎంతో మందికి సంతానం కలిగింది. అసలు వీర్యదానం చేయడం వెనుక ఓ కథ ఉంది. 15 ఏళ్ల కిందట అతడి స్నేహితుడు వింత సహాయం కోరాడు. అతడికి, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం తనను వీర్యం దానం చేయాలని అడిగాడు. అది విన్న తర్వాత పావెల్ విపరీతంగా నవ్వుకున్నాడు. కానీ ఆ తర్వాత సంతానం సమస్య ఎంత తీవ్రమైందో తెలుసుకున్నాడు. అనంతరం వీర్యదానానికి ముందుకువచ్చాడు. తొలిసారి తన స్నేహితుడికి వీర్యం దానం చేసిన పావెల్ అనంతరం వంద మందికి పైగా చేశాడు. దానివలన ఇప్పటివరకు 12 దేశాల్లో పావెల్ వీర్యదానంతో వందమందికి పైగా జంటలకు సంతాన ప్రాప్తి కలిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook