)
74 years old man pays rs 2 crores for 24 years teen bride in Indonesia: చాలా మంది యువతీ, యువకులు అసలు తమకు పెళ్లిళ్లు కావడంలేదని తెగ టెన్షన్ లు పడుతున్నారు. కొంత మంది ఎంత చదువున్నా, ఆస్తి పాస్తులున్న కూడా పెళ్లిళ్లు కావడంలేదు. అమ్మాయిలు కొంత మంది డబ్బులున్న వారికి సర్కారు జాబ్ అది కూడా మంచి హోదా ఉన్న జాబ్ ఉంటేనే పెళ్లికి ఓకే చెప్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేటు జాబ్స్ చేస్తున్న వారు పెళ్లికానీ ప్రసాదుల్లానే మిగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొంత మంది ముసలోళ్లు మాత్రం టీనేజ్ అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకుని అబ్బాయిల పొట్టలు కొడుతున్నారు. మనవలు, మనవరాళ్లతో ఆడుకొవాల్సిన వయసులో.. టీనేజ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మరీ అమ్మాయిలు కూడా వీరి డబ్బుల్ని చూసో మరేంటో కానీ.. ముసలోళ్లతో కూడా పెళ్లికి రెడీ అయిపొతున్నారు. తాజాగా.. ఇండోనేషియాలో జరిగిన ఒక పెళ్లి వేడుక నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
ఇండొనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ లోని పాసిటన్ రీజెన్సీలో అక్టోబర్ 1న 74 ఏళ్ల టార్మన్ కు, 24 ఏళ్ల అరికా అనే అమ్మాయికి పెళ్లి జరిగింది. దీని కోసం తాత.. ఏకంగా రూ. 2 కోట్ల కన్యాశుల్కంగా ఆమెకు ఇచ్చిమరీ పెళ్లి చేసుకున్నాడు.
ముసలోడికి టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకొవాలని చాలా కోరక అని.. అందుకే ఆమె డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. లైఫ్ లో అన్ని ఎంజాయ్ చేయాలని తరచుగా ఆయన చెప్పేవాడంట. మొత్తంగా వీరి పెళ్లి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
అయితే.. పెళ్లి జరిగినప్పటి నుంచి టార్మన్, అరికా జంట కన్పించడంలేదని, వీరు డైవర్స్ కు రెడీ అయిపోయారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని తాజాగా.. టార్మన్ ఖండించాడు. మరోవైపు వీరి పెళ్లిలో ఫోటో గ్రాఫర్ వాళ్లకు డబ్బులు ఎగ్గొట్టారని కూడా వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత కక్కుర్తీ అవసరమా..?.. అంటూ ముసలోడ్ని ఏకీపారేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.