అప్పుడు మోదీతో, ఇప్పుడు రజినీకాంత్ : బేర్ గ్రిల్స్

టీవీ ప్రెజెంటర్ బేర్ గ్రిల్స్, తన వైల్డ్ షూట్ "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రత్యేక ఎపిసోడ్‌ను విలక్షణ నటుడు రజనీకాంత్‌తో చిత్రీకరించనున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో 1974లో టైగర్ రిజర్వ్‌గా స్థాపించబడిన కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌లో

Updated: Jan 28, 2020, 05:28 PM IST
అప్పుడు మోదీతో, ఇప్పుడు రజినీకాంత్ : బేర్ గ్రిల్స్

బెంగళూరు: టీవీ ప్రెజెంటర్ బేర్ గ్రిల్స్, తన వైల్డ్ షూట్ "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రత్యేక ఎపిసోడ్‌ను విలక్షణ నటుడు రజనీకాంత్‌తో చిత్రీకరించనున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో 1974లో టైగర్ రిజర్వ్‌గా స్థాపించబడిన కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌లో ఈ ఎపిసోడ్ చిత్రీకరించబడుతుందని టైమ్స్ నౌ నివేదించింది.

2019 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ యాత్ర ప్రదర్శనకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారని బేర్ గ్రిల్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిగి ఉన్న అనుభవం గురించి ANIతో  బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ, మేము కొన్ని భయంకర పారిస్థితులు ఎదుర్కొన్నామని, పెద్ద పెద్ద రాళ్ళు, కుండపోత వర్షంతో, చిత్రీకరణలో ఉన్న మా బృందం ప్రమాదపు అంచుల్లో ఉందని, ఆ సమయంలోప్రధానమంత్రి చాలా ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. తన మొత్తం షూట్ లో ప్రధానితో ఉన్న అనుభవాలను పంచుకున్నాడు. సంక్షోభం వచ్చేవరకు తెలియదు ఎవరు ఎలా ఉంటారోనని బేర్ గ్రిల్స్ తన అనుభవాలను పంచుకున్నాడు. 

రజనీకాంత్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో, వివిధ భాషల్లో కళా ప్రక్రియలు, విభిన్న చిత్ర పరిశ్రమలలో పనిచేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం  పోలీసు యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ త్వరలోనే విడుదల కాబోతుందని సినీ వర్గాలు తెలిపాయి. 

నేషనల్ జియోగ్రాఫిక్ రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ యొక్క మరో సీజన్‌తో గ్రిల్స్ తిరిగి వస్తారని సోమవారం ప్రకటించారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖులు చాన్నింగ్ టాటమ్, బ్రీ లార్సన్, జోయెల్ మెక్‌హేల్, కారా డెలివింగ్న్, రాబ్ రిగ్లే, ఆర్మీ హామర్, డేవ్ బటిస్టా ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..