Iran - Israel War: ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు..

Iran - Israel War: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అది ప్రపంచ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ వార్ లో అమెరికా రంగ ప్రవేశంతో అంతా మారిపోయింది. తాజాగా ఇరాన్ పై అమెరికా నేరుగా ఎటాక్ కు దిగడంతో ఈ యుద్ధం ముదిరి పాగానా పడింది. దీని ఎఫెక్ట్  అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకాడానికి కారణమయ్యాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 23, 2025, 10:36 AM IST
Iran - Israel War: ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు..

Iran - Israel War: ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా డైరెక్ట్ రంగ ప్రవేశం చేసి ఇరాన్ లోని కీలకమైన అణు స్థావరాలను గురి చూసి కొట్టింది. అంతేకాదు ఆ దేశ శాస్త్రవేత్తలను లేపేసింది. దీంతో ఆ దేశం మరో అణు బాంబు తయారు చేయాలంటే కొన్ని దశాబ్దాలు పట్టేలా ఉంది. మొత్తంగా ఇరాన్ పై అమెరికా డైరెక్ట్ వార్ తో అంతర్జాతీయం ముడి చమురు ధరలు పెరగడానికి కారణమయ్యాయి.  ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో వెస్ట్రన్ ఏషియాలో  ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి.  ఒక దశలో ఐదు నెలల గరిష్ఠాన్ని చమురు ధరలు తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లను చేరింది. అటు యూఎస్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 2.8 శాతం ఎగబాకి 75.98 డాలర్లకు చేరింది. 

Add Zee News as a Preferred Source

ఇక, ఆసియా మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.7శాతం మేర కుంగాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ల పైనా పడింది. సెన్సెక్స్‌ 700 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయింది.  మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.1శాతం తగ్గి 3,363 డాలర్లుగా ఉంది. 

అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హర్మూజ్‌ జల మార్గాన్ని మూసివేయాలని ఇరాన్‌ పార్లమెంట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.  ఈ పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్‌ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్‌ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు.

మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ కు మద్దతు ఇస్తామని పాకిస్తాన్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది, అమెరికా వైమానిక దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలన్నింటినీ ఉల్లంఘించిందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం, ఇరాన్ తనను తాను రక్షించుకునే పూర్తి హక్కును కలిగి ఉందన్నారు. మిడిల్ ఈస్ట్ లో  ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. గత కొన్ని రోజులుగా  అమెరికాను ప్రశంసించడంలో మునిగిపోయిన పాక్‌. .. ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేయడంతో తన వైఖరిని మార్చుకుంది.

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News