US Tornado: అమెరికాను ఒణికిస్తోన్న వరుస ప్రమాదాలు.. మొన్న కార్చిచ్చు.. నేడు టోర్నడోలు..

US Tornado: అమెరికాను వరుస బీభత్సాలు వణికిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి  అగ్ర రాజ్యాన్ని వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు యూఎస్ ను కార్చిచ్చు ముప్పుతిప్పలు పెడితే.. తాజాగా టోర్నడోలు అక్కడ ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 17, 2025, 09:18 AM IST
US Tornado: అమెరికాను ఒణికిస్తోన్న వరుస ప్రమాదాలు.. మొన్న కార్చిచ్చు.. నేడు టోర్నడోలు..

US Tornado: అమెరికాలో భయంకరమైన తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపానుల ధాటికి పలు రాష్ట్రాల్లో 32 మంది పౌరులు చనిపోనియినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు  ప్రకటించాయి. అనేకమంది గల్లంతయ్యారు. అమెరికాలో పెనుగాలులు  బీభత్సం సృష్టిస్తున్నాయి. మిస్సోరిలో పదిమంది చనిపోగా.. అర్కన్సాస్​లో ముగ్గురు, టెక్సస్​లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారని సమాచారం. హైవేలపై వెళుతున్న వాహనాలు పెనుగాలులకు ప్రమాదానికి గురయ్యాయి. ఒకదానిని మరొకటి ఢీ కొని ప్రమాదానికి గురయ్యాయి. వాటిలో  ప్రయాణిస్తున్న వారిలో కొందరు  ప్రాణాలు కోల్పోయారు.  మరికొంతమంది గాయపడ్డారని తెలుస్తోంది. మిస్సోరీ హైవేపై జరిగిన ప్రమాదాల్లో పదిమంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.  

Add Zee News as a Preferred Source

కాన్సాస్‌లో ధూళి తుఫాను కారణంగా ఏమీ కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. ఇళ్లు గుర్తుపట్టలేనంతగా శిథిలమయ్యాయి. పాఠశాలలు, ఆఫీసు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆర్కాన్సాస్‌లో ముగ్గురు మరణించారు. 29 మంది గాయపడ్డారు.

జార్జియా, ఆర్కాన్సాస్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. టెక్సాస్‌లో ధూళి తుపాన్‌లో ముగ్గురు మరణించారు. ఒక్లహోమాలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి, 689 చదరపు కిమీ అటవీ ప్రాంతం కాలిపోయింది. మిస్సిస్సిప్పి, లూసియానా, అలబామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. తుపానులు 10 కోట్ల మందిని ప్రభావితం చేయనున్నట్లు అంచనా. మొత్తంగా బలమైన గాలులు వీచి 130కిపైగా కార్చిచ్చులు చెలరేగాయి. మినెసోటా, సౌత్ డకోటాలో భారీగా మంచు కురుస్తుందని అధికారులు హెచ్చరించారు. టెక్సాస్, ఒక్లహోమా, మిస్సోరీలో 2లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది.

మిసిసిప్పి వ్యాలీలో టోర్నడోల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది.  ఓ ఇళ్లు తలకిందులుగా పడగా లోపలున్న వారిని  రెస్క్యూ సిబ్బంది కాపాడింది. అక్కడ  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టోర్నడోల ప్రభావంతో ఒక్లహోమా రాష్ట్రంలో మొత్తం 130 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయని అధికారులు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News