)
Trump Vs Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి టారిఫ్ మోత మోగించారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇందువల్ల దేశీయ తయారీ వేగవంతం అవుతుందన్నారు. విడిభాగాలు, తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సుంకం ఫలితంగా వృద్ధి మరింత పెరుగుతుందన్నారు ట్రంప్ . ఇది పర్మినెంట్ అని టారిఫ్ తన ఆదేశాల్లో తెలిపారు. ఈ నిర్ణయంపై వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 3 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువైన వాహన విడిభాగాల ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా టారిఫ్ వల్ల ఏటా అదనంగా 100 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8.5 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకుంటున్న అమెరికా వాహన తయారీ కంపెనీలకు ఈ నిర్ణయం మింగుడు పడకపోవచ్చంటున్నారు. ఏప్రిల్ నుంచి పన్ను పెంచితే వ్యయాలు అధికమై, వాహన ధరలు పెంచాల్సి వస్తుందన్నరు. ఫలితంగా అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికాలో తయారైన కార్లను కొనుగోలు చేసే వారికి ఆదాయపు పన్నులో, వాహన రుణాల వడ్డీలో మినహాయింపు ఇస్తామని ట్రంప్ ప్రకటించడం అమెరికన్లకు, కంపెనీలకు కొంత ఊరట కలిగించే అంశం.
ఈ పన్ను భారం భరించలేక చాలా వరకు విదేశీ కంపెనీలు అమెరికాలో మరిన్ని తయారీ ప్లాంట్లు నెలకొల్పుతాయనే భావన ఉంది. దీంతో అమెరికా తన బడ్జెట్ లోటును పూడ్చుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకు కొన్నేళ్లు పట్టొచ్చని చెబుతున్నారు. ఈ లోపు మాత్రం కార్ల ధరలు పెరుగుతాయంటున్నారు. ప్రస్తుతం కార్ల సగటు ధర 49,000 డాలర్లుగా ఉంది. ట్రంప్ టారిఫ్ భారాన్ని పూర్తిగా వినియోగదార్లకు బదలాయిస్తే, దిగుమతి కారు ధర 12,500 డాలర్ల మేర పెరుగుతుంది. దీంతో మధ్య తరగతి, వేతన జీవులకు కార్ల ఎంపిక విషయంలో ఎక్కువ అవకాశాలు ఉండవని భావిస్తున్నారు.
వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించడంతో, మన దేశంలోనూ వాహన కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటార్స్ షేరు 5.56% నష్టపోయి రూ.668.60 వద్ద ముగిసింది. అమెరికాకు మన దేశం నుంచి పూర్తిగా తయారై వెళ్లే కార్లు దాదాపు లేవు. కాబట్టి మన వాహన కంపెనీలకు ఇబ్బంది ఉండదు. కానీ, వాహన విడిభాగాల కంపెనీలపై ప్రభావం పడొచ్చు. పరిశ్రమ అంచనాల ప్రకారం.. మన దేశ వాహన విడిభాగాల ఎగుమతుల్లో 29.2% అమెరికాకే చేరుతున్నాయి. డీజిల్ ఇంజిన్ విడిభాగాల్లో 31.4% ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. వాహన ప్రధాన విడిభాగాలైన ఇంజిన్లు, ఇంజిన్ భాగాలు, ట్రాన్స్మిషన్స్, పవర్ ట్రైన్ భాగాలు, విద్యుత్ భాగాలపై మే కల్లా మరో 25% సుంకం విధించొచ్చన్న అంచనాలున్నాయి. కాబట్టి విడిభాగాల పరిశ్రమకు ఆందోళన తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe