Trump Warning: అమెరికా ఇప్పుడు అందని ద్రాక్షగా మారనుంది. ఆ దేశంలో స్థిరపడే ఆలోచన అటుంచి కొద్దికాలం ఉండాలన్నా ఇబ్బందికర పరిణామాలే ఎదురుకానున్నాయి. అగ్రరాజ్యంలో 30 రోజులు దాటి ఉంటే ప్రభుత్వంలో నమోదు చేయించుకోవల్సిందే. లేకపోతే జైలు శిక్ష పడుతుంది మరి.
అమెరికాలో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అమెరికా అమెరికన్లకే తప్ప మరెవరికీ కాదంటోంది. ఆ దేశంలో 30 రోజులు దాటి ఉంటే వెంటనే సంబంధిత కార్యాలయంలో ఎంట్రీ చేయించుకోవాలి. లేకపోతే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంకా జైలు శిక్ష కూడా ఉండవచ్చు. ఇదేదే పుకార్లు కానేకావు. అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చేస్తున్న హెచ్చరిక ఇది. అగ్రరాజ్యంలో 30 రోజులు దాటి ఉంటే తప్పనిసరిగా వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదా సొంతంగా దేశం వదిలి వెళ్లిపోమని సూచిస్తోంది. ఏ విధమైాన నేర చరిత్ర లేకపోతే దేశంలో సంపాదించుకున్న డబ్బుల్ని దాచుకుని వెళ్లవచ్చని తెలిపింది. విమాన టికెచ్ భరించే స్థితి లేకపోతే రాయితీ ఇచ్చి స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
జరిమానా ఎంత ఉంటుంది
దేశం విడిచి వెళ్లిపోవల్సిందిగా ఉత్తర్వులు అందుకున్న గడువు తేదీ దాటి ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా 998 డాలర్లు జరిమానా చెల్లించాలి. తమంతట తాముగా వెళ్లకుంటే 1000 నుంచి 5000 డాలర్ల వరకూ జరిమానా ఉంటుంది. భవిష్యత్తులో అమెరికా వచ్చేందుకు అవకాశం ఉండదు. జైలు శిక్ష కూడా పడవచ్చు.
అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైన అనుమతి లేకుండా దేశంలో ఉంటున్ విదేశీయులకు వర్తిస్తుంది. హెచ్1 బి లేదా స్టూడెంట్ వీసాలకు ఇది వర్తించదు. హెచ్1బి వీసా ఉండి ఉద్యోగం కోల్పోతే నిర్ణీత వ్యవధిలోగా దేశం వదిలి వెళ్లిపోవల్సి ఉంటుంది.
Also read: Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో రెండు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









