)
America Cargo Plane Crash Louisville Videos: వరుస ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న బస్సు, నిన్న రైలు, నేడు విమానం ప్రమాదం చోటుచేసుకుంది. కెంటకీ రాష్ట్రం మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, పొగ వ్యాపించాయి. అయితే అక్కడ ఉన్న పలు భవనాలు కూడా దగ్ధం అయ్యాయి. ఆ ఫ్లైట్ హవాయిలోని హోనోలుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు .
ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో వీడియోలో అవి కనిపిస్తున్నాయి. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో 95 వేల లీటర్ల ఫ్యూయల్ ఉందని దీనివల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ఇక బిల్డింగులపై కూలడంతో కూడా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
🇺🇸✈️💥 A UPS Airlines cargo plane with flight number UPS2976 (a McDonnell Douglas MD-11F) crashed shortly after takeoff from Louisville Muhammad Ali International Airport (Kentucky, USA). #USA pic.twitter.com/LVfreVv4yB
— 🔰 Military-News (@MilitaryNewsEN) November 4, 2025
UPS Flight 2976 crashes into Muhammad Ali International Airport in Louisville, KY. ✈️
3 Crew Members were confirmed to be on board. The cargo plane struck multiple buildings, and left a blazing fire due to 25K GALLONS of fuel being on board at the time of crash. 🤯 pic.twitter.com/umVwetKjcU
— Pop Rap (@ThePopRap) November 5, 2025
ఆకాశమంత పొగ వ్యాపించి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయం దగ్గరలో ఉన్న ఫెర్నో వ్యాలీ గ్రేడ్ లేన్ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. బాగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఈ కార్గో విమానం మంగళవారం సాయంత్రం 5:10 గంటల సమయంలో లూయిస్విల్లే నుండి టేక్ ఆఫ్ అయి ర్యాడర్ నుంచి మిస్ అయింది. ఆ కొద్దిసేపటికి ఫ్లైట్ ఎగిరి రాడార్ 24 నుండి ట్రాకింగ్ డేటా చూపించింది. తర్వాత పైకి కదులుతూ క్రాష్ అయిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ధ్రువీకరించింది. విమానం మెక్ డోనల్ డాగ్ ఎండి 11 రకానికి చెందినదని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.