America President Donald Trump: అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న ఫ్లైట్.. అమృత్ సర్ లో దిగిన 205 మంది..

America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌ కు  చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2025, 08:00 PM IST
America President Donald Trump: అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న ఫ్లైట్.. అమృత్ సర్ లో దిగిన 205 మంది..

America President Donald Trump: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను యూఎస్ మిలీటరీ ప్రత్యేక విమానంలో భారత్ కు వచ్చింది. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా 205 మంది లేరని స్పష్టం చేశారు. వీరందరినీ అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా అక్రమ వలసదారులతో భారత్‌కు వచ్చారు.

Add Zee News as a Preferred Source

అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్‌ వద్ద పట్టుబడినట్లు సమాచారం.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. అమెరికాలో మొత్తం కోటి 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News