)
2026 లో ఫుట్ బాల్ ప్రపంచకప్ జరుగనుంది. ఈ సందర్భంగా తొలి ఫిఫా శాంతి బహుమతి ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తున్నట్టు ప్రకటించారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హజరయ్యారు. కాగా ట్రంప్‌కు శాంతి బహుమతిని అందించడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని తెలిపింది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతే కాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా తెలిపింది.
ఫిఫా ప్రపంచకప్ 2026 డ్రా కార్యక్రమంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌నకు ప్రకటించారు. దీంతో బంగారు పతకాన్ని ట్రంప్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని ఫిఫా అధ్యక్షుడు గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని మునగ చెట్టు ఎక్కించారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారన్నారు.
కాగా శాంతి బహుమతి అందుకోవడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటన్నారు డోనాల్డ్ ట్రంప్. అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని తనకు తాను భుజకీర్తులు తగిలించుకున్నారు.. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ అన్నారు. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారని, మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టానని, అది ఎంతో గర్వకారణమన్నారు ట్రంప్. అదే సమయంలో ఇండియా-పాకిస్థాన్ యుద్ధాన్ని సైతం తానే అపానంటూ మరోసారి పాత పాట పాడారు ట్రంప్. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయన్నారు. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయని చెప్పుకొచ్చారు.
Read more: నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..
అయితే ట్రంప్ కు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.