)
Modi Vs Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు ఎపుడు మిత్రులుగా ఉంటారు. ఎవరు ఎపుడు శత్రువులుగా మారుతారనేది అప్పటి రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహితంగా మెలిగిన ట్రంప్ .. ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. పాకిస్థాన్ లో తను దాచుకున్న అణ్వాయుధాలపై భారత్ దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య నిప్పు రాజుకుంది. అప్పటి నుంచి భారత్ పై పగపట్టినట్టు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి వస్తువులపై భారీగా పన్నులు విధించాడు. ముందుగా 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే కదా.
ఇన్నాళ్లు బెదిరింపులతో భారత్‌ను కాళ్ల బేరానికి తేవాలనుకున్న ట్రంప్, తాజాగా అలాంటి పద్దతులకు ఫులిస్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ , ఇక వాణిజ్య చర్చలు ఉండవన్నారు. ఇంతలో ఆయనపై స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో భారత్‌పై ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ మధ్యనే భారత్-అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పుకొచ్చిన ట్రంప్, తాజాగా ట్రేడ్ డీల్‌పై కూడా మాట్లాడారు. భారత్‌తో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతున్నాయని ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య అడ్డంకులను తొలగించే దిశగా ఈ చర్చలు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్ వేదికగా వెల్లడించారు.
***
వైట్ హౌస్‌లో భారత్- అమెరికా సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తారా? అని ప్రముఖ మీడియా ప్రతినిధి అడిగి ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికర సమాధానం చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా చెప్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని, ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆయన స్పష్టం చేశారు. మోదీతో స్నేహం ఎప్పటికీ ఉంటుంది అంటూనే ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. త్వరలోనే ఆయనతో మాట్లాడుతానన్నారు.
మరోవైపు ట్రంప్ కూడా అమెరికా తనకు సన్నిహిత మిత్ర దేశమని ఎక్స్ వేదికగా చెప్పారు. టారీఫ్ ల యుద్దానికి త్వరలో ముగింపు పలకడం ఖాయం అన్నారు. త్వరలో ఈ అంశంపై ట్రంప్ తో మాట్లాడుతా అని చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.