America VC: భారత్ కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఉప దంపతులు..

America VC: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉష భారత్‌ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 24వ తేదీన వరకు భారత్‌లో వారి పర్యటన కొనసాగుతుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2025, 09:20 PM IST
America VC: భారత్ కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఉప దంపతులు..

America VC: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే.. ఆ దేశ ఉపాధ్యక్షుడు భారత్ కు రానున్నారు. అయితే జేడీ వాన్స్ భారత్ తో పాటు  ఇటలీలోనూ పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్‌ భారత్‌కు రావడం ఇదే ఫస్ట్ టైమ్. పైగా ఆయన సతీమణి ఉష భారతీయ మూలాలున్నాయి.. అందులో తెలుగమ్మాయి కావడం మరో విశేషం.

Add Zee News as a Preferred Source

అయితే ఇటలీ, భారత్‌ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాల నేతలతో  జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నట్లు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అదే సమయంలో భారత పర్యటనలో భాగంగా జేడీ వాన్స్‌ దంపతులు ఢిల్లీ,  జైపుర్‌ , ఆగ్రాను సందర్శించనున్నారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారని సమాచారం.

జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వారి వివాహబంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లులు ఉన్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో భారత్‌కు రానున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News